సునీల్ గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. మొదట ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. హాస్యనటుడిగా నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు అతనికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న మంచి ప్రజాదరణ పొందింది.
2003లో నువ్వు నేను, 2006 లో ఆంధ్రుడు చిత్రాలకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది.
No comments:
Post a Comment